సంచలనంగా మారిన ఉదయ్ కిరణ్ బయోపిక్ టైటిల్ !

‘ఎన్టీఆర్’ బయోపిక్ నుండి తప్పుకున్న దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ ను చేయనున్న సంగతి తెలిసిందే. నిన్ననే బయటికొచ్చిన ఈ ప్రకటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చిన్న వయసులోనే హీరోగా ఊహించని స్టార్ డమ్ ను చూసి జీవితంలో అనేక రకాలైన ఒడి దుడుకుల్ని, క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కుని చివరికి ఆత్మహత్య చేసుకున్న ఉదయ్ కిరణ్ జీవితాన్ని వెండితెర మీద తేజ ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలని అందరిలోను ఆసక్తి కలిగింది.

ఇక ఈ చిత్రానికి తేజ సంచలన రీతిలో ‘కాబోయే అల్లుడు’ అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాక ఈ చిత్రాన్ని తేజ స్వయంగా నిర్మించాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది, టైటిల్ అదేనా కదా అనే విషయాలు తెలియాలంటే తేజ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ఉదయ్ కిరణ్ కెరీర్లోని ‘చిత్రం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా’ వంటి హిట్ సినిమాలను తేజ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version