మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ తన రేంజ్ సినిమా చేయాలని అయితే చూస్తుండగా ఈ టైం లో అనౌన్స్ చేసిన మాసివ్ చిత్రమే తన కెరీర్ 156వ సినిమాగా అనౌన్స్ చేయడంతో దీనిపైనా నెక్స్ట్ లెవెల్ హైప్ స్టార్ట్ అయ్యింది. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ నుంచి అయితే ఓ క్రేజీ ఫాంటసీ డ్రామాగా చేస్తుండడంతో మెగా ఫ్యాన్సంతా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ గా మారింది.
ఈ చిత్రానికి ప్రస్తుతం ఓ ఆసక్తికర టైటిల్ అయితే పరిశీలనలో ఉందట. అదే “విశ్వంభర”. ఈ కథాంశానికి చిరంజీవి ఛరిష్మాకి పర్ఫెక్ట్ గా ఇది ఉంటుంది అని ఓ టాక్ అయితే ఇప్పుడు మొదలైంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
