సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్ తొలిసారి అవుట్ అండ్ అవుట్ ఎంటెర్టైనింగ్ సబ్జెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బోలెడంత ప్రత్యేకతను సంతరించుకుంది. మహేష్ ఈ సినిమాలో పూర్తిస్థాయి యాక్షన్ తో పాటు ఫుల్ కామెడీ కూడా చేస్తాడట. ముఖ్యంగా ద్వితీయార్థంలో వినోదం పుష్కలంగా ఉంటుందని.. మహేష్, బండ్ల ట్రాక్ సినిమాలో బాగా వర్కౌట్ అవుతుందని తెలుస్తోంది.
సో.. అనిల్ రావిపూడి అభిమానుల అంచనాలకు తగ్గట్టే సినిమాను తెరకెక్కిస్తున్నారన్నమాట. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుండగా తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. అలనాటి స్టార్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించనున్నారు.
