ఇంటర్వ్యూ : సాహి సురేష్ – ‘భైరవ ద్వీపం’ స్పూర్తితోనే నేను ఆర్ట్ డైరెక్టర్ ని అయ్యాను.

suresh
ఓ సినిమాకి కథ సిద్దం అయ్యాక అసలు సిసలైన ప్రాణం పోసేది ఆర్ట్ డైరెక్టర్స్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే వారు డిజైన్ చేసే సెట్స్ ని బట్టే సినిమాకి ఓ మంచి లుక్ అండ్ ఫీల్ వస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్ట్ డైరెక్టర్స్ తమ టాలెంట్ ని నిరూపించుకొని తెలుగులో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలా వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ కార్తికేయ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి సినిమాలకు పనిచేసి ఇప్పుడు కంచె లాంటి ఓ డిఫరెంట్ సినిమాకి పనిచేసాడు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ముందుగా మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.? ఎలా ఇక్కడికి వచ్చారు.?
స) నాకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. బాలకృష్ణ గారు చేసిన భైరవద్వీపం సినిమా నాకు స్పూర్తినిచ్చింది. ఆ సినిమాని సుమారు 100సార్లు పైనే చూసుంటాను. ఆ సినిమాకి చేసిన సెట్ వర్క్, రాజుల నేపధ్యం, భారీగా అనిపించే టేకింగ్ నన్ను థ్రిల్ చేసాయి. అవే నన్ను సినిమాల వైపు నడిచేలా చేసింది.

ప్రశ్న) సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ మీ జర్నీ ఎలా ఉంది.?
స) మా నాన్నగారు చనిపోయాక 2010లో హైదరాబాద్ కి వచ్చాను. నాకు సినిమాల మీద ఉన్న పిచ్చి వలన ప్రతి రోజూ ఎక్కడెక్కడ షూటింగ్స్ జరుగుతున్నాయని తెలుసుకొని ఆ సినిమా సెట్స్ కి వెళుతుండేవాన్ని. అలా నాకు మురళి అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. అతను నన్ను తీసుకెళ్ళి ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ పేకేటి రంగకి పరిచయం చేసాడు. ఆయన దగ్గర నేను చాలా రోజులు పని చేసి చాలా విషయాలు నేర్చుకున్నాను.

ప్రశ్న) మీకు ఫస్ట్ బ్రేక్ ఎలా వచ్చింది.?
స) పేకేటి రంగ గారి తర్వాత ‘చిత్రం’ సినిమాకి గాను నారాయణరెడ్డి దగ్గర పనిచేసాను. ఆయన నన్ను జెమిని కిరణ్ కి పరుచయం చేస్తే ఆయనేమో అశోక్ కుమార్ గారికి పరిచయం చేసారు. ఆయన నేతృత్వంలో అనగనగ ఓ ధీరుడు సినిమాకి పనిచేసాను. ఆ తర్వత ఆనంద్ సాయి గారిని కలవడం, ఆయనతో కలిసి శక్తి సినిమాకి పనిచేసాను. ఆయనే నన్ను మొదటిసారి అశ్వనీదత్ గారికి పరిచయం చేసారు. ఆయన పరిచయం వల్ల నాకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది.

ప్రశ్న) ఆర్ట్ డైరెక్టర్ గా మీ పేరు పడ్డ మొదటి సినిమా ఏంటి.? ఆ సినిమా అనుభవం ఏంటి.?
స) పైన చెప్పినట్టు అశ్వనీదత్ గారు నన్ను పిలిచి మరీ రవితేజ గారి సారొచ్చారు సినిమా ఆఫర్ ఇచ్చారు. దాంతో నేను చాలా హ్యాపీ, ఆ సినిమా క్సోం డే అండ్ నైట్ కష్టపడ్డా. టోటల్ గా దత్ ఫ్యామిలీ నాకు ఇచ్చిన సపోర్ట్ ని నేను ఎప్పటికీ మరచిపోలేను. అలాగే వారికి నేనెప్పుడు రుణపడి ఉంటాడు.

ప్రశ్న) మీరు పనిచేసిన కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి.?
స) సారొచ్చారు సినిమాతో ఆర్ట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు వచ్చింది. దాంతో నాకు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, కార్తికేయ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి సినిమాల ఆఫర్స్ వచ్చాయి.ఆ సినిమాలన్నీ కూడా హిట్ అవ్వడం వలన నా వర్క్ కి మరింత పేరు వచ్చింది. అక్కడి నుంచి టాలీవుడ్ లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ప్రస్తుతం కొన్ని మంచి చిఎన్మాలు చేస్తూ బిజీగా ఉన్నాను.

ప్రశ్న) కంచె సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ అయ్యే చాన్స్ ఎలా కొట్టేసారు.?
స) నాకు క్రిష్ కి చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయమే ఈ సినిమా అవకాశం తెచ్చింది. నాకు క్రిష్ స్టొరీ చెప్పినప్పుడు నా నోట మాట రాలేదు. అలాగే ఈ సినిమాతోనే నా కెపాసిటీ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ కలిగింది. క్రిష్ హిందీ సినిమా గబ్బర్ షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచే కంచె వర్క్ మొదలైపోయింది.

ప్రశ్న) కంచె అనేది పీరియడ్ ఫిల్మ్. దానికోసం ఎలాంటి రీసర్చ్ చేసారు.?
స) కంచె అనేది కేవలం 4 నెలల్లో షూటింగ్ ఫినిష్ చేసిన సినిమా. దానికి సంబందించిన క్రెడిట్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే చెందుతుంది.వరల్డ్ వార్ II గురించి చాలా రీసర్చ్ చేసాం, అలాగే చాలా బుక్స్ చదివాం. అలాగే ఈ సినిమా పాలకొల్లు లోని తాటిపాక అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఉంటుంది. మేము ఆ విలేజ్ ని దత్తత తీసుకొని 1935 లుక్ వచ్చేలా పూర్తిగా మార్చేసాము. చెప్పాలంటే కొత్త రోడ్స్ అన్నిటినీ నాశనం చేసేసి సినిమాకి తగ్గట్టుగా రోడ్స్ వేసుకున్నాం..

ప్రశ్న) కంచె విషయంలో మీకు బాగా టఫ్ అనిపించిన పార్ట్ ఏమిటి.?
స) క్రిష్ ఒక డైరెక్టర్ గా చాలా టఫ్ టాస్క్ మాస్టర్.. అతను అనుకున్నది అనుకున్నట్టుగా చాలా రియలిస్టిక్ గా ఉండేలా కావాలి..అందుకే మేము చాలా రీసర్చ్ చేసి, వార్ ఎపిసోడ్ లో కొన్ని రియల్ వెపన్స్ ని కూడా ఉపయోగించాం. సినిమాలో అందరూ వేసుకునే కాస్ట్యూమ్స్ నుంచి బ్యాక్ గ్రౌండ్ లో కనిపించే ప్రతి ఒక్కటి మేము క్రియేట్ చేసిందే.. కంచె సినిమాలో టఫ్ అంటే స్వాతంత్ర్యం రాకముందరి లుక్ తీసుకురావడం, సూపర్బ్ కెమెరా వర్క్ తో దానిని మేనేజ్ చేసాం.

ప్రశ్న) ఒక సినిమా సెట్స్ డిజైన్ చేయడం కోసం ఎలా అప్రోచ్ అవుతారు.?
స) ఒకసారి డైరెక్టర్ పూర్తి నేరేషన్ ఇచ్చిన తర్వాత, నేను కొన్ని రెఫరెన్స్ ల కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తాను. అలాగే సేమ్ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలు చూసి వాటి నుంచి కొంత స్ఫూర్తి తీసుకుంటాను. అలా వాటన్నిటినుంచీ ఒక ఐడియా వచ్చాక, నా క్రియేటివిటీని కలిపి సెట్ డిజైన్ మొదలు పెడతాను.

ప్రశ్న) కంచె జర్నీ నుంచి మాతో ఓ మెమొరబుల్ సంఘటనని షేర్ చేసుకోగలరా.?
స) నేను ఇదివరకే చెప్పినట్టు, నన్ను ఇన్స్పైర్ చేసిన సినిమా భైరవ ద్వీపం. ఆ సినిమా డైరెక్టర్ సింగీతం శ్రీనివరావు ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో కనిపించాడు. షూటింగ్ టైం లో ఆయన నన్ను ప్రత్యేకంగా పిలిచి నా సెట్ వర్క్ ని మెచ్చుకున్నారు. నా లైఫ్ లో జరిగిన బెస్ట్ మోమెంట్ అది.

ప్రశ్న) ఆర్ట్ డైరెక్టర్ జాబు అనేది చాలా కష్టం. ఆ జాబ్ ని మీరెలా మేనేజ్ చేయగలుగుతున్నారు.?
స) సెట్ లో ఏ చిన్న ఇబ్బంది జరిగినా మనల్నే బ్లేమ్ చేస్తారు. మనం ఎప్పడూ సెట్లో ఉండి అన్ని పనులు సక్రమంగా జరిగేలా చూసుకోవాలి. ఈ ఫీల్డ్ లో చాలా శ్రద్దగా ఉండాలి, అలాగే అభద్రత కూడా ఉంటుంది. ఇక్కడ లక్కీ ఏంటి అంటే నా ఫ్యామిలీ నాకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటూ నా నుంచి బెస్ట్ అవుట్ పుట్ వచ్చేదానికి సాయం చేస్తారు.

ప్రశ్న) మీరు చేస్తున్న తదుపరి సినిమాలేమిటి.?
స) ఓంకార్ తో చేసిన రాజుగారి గది కూడా కంచెతోనే రిలీజ్ అవుతోంది. అది కాకుండా అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను ఫిల్మ్ చేస్తున్నాను.

ప్రశ్న) రాజుగారి గది సినిమాలోని సెట్స్ చాలా బాగున్నాయి. వాటి గురించి చెప్పండి.?
స) రాజుగారి గది సినిమాని చాలా లో బడ్జెట్ లో తీసారు. కానీ ఆ సినిమాకి కొన్ని ఆసక్తికరమైన సెట్స్ కావాలి. హర్రర్ కామెడీ అనగానే ఆడియన్స్ కి ఆసక్తిని క్రియేట్ చేసే సెట్టింగ్స్ కొన్ని ఉండాలని నేను ఫీల్ అయ్యి ఈ సినిమాకి సెట్స్ డిజైన్ చేసాను. సినిమా రిలీజ్ అయ్యాక నా వర్క్ కి మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి తదుపరి సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్పాము.

Exit mobile version