ఇంటర్వ్యూ : ఉపేంద్ర – మహిళలకి కూడా ఎక్కువ నచ్చే సినిమా ‘ఉపేంద్ర 2’

uppendra
ఎవ్వరూ ఊహించని కాన్సెప్ట్ లకు, క్రేజీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే పేరు ఉపేంద్ర. కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్రకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తను నటించిన ఉపేంద్ర, రా, నేను, సూపర్ సినిమాలు తెలుగులో పెద్ద హిట్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత ఉపేంద్ర సినిమాకి సీక్వెల్ గా చేసిన ‘ఉపేంద్ర 2’తో తెలుగులో తన స్ట్రైట్ ఫిల్మ్ రిలీజ్ చేయనున్నాడు. ఈ సినిమా ఆగష్టు 14న తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఎంతో సింపుల్ గా ఉండే ఉపేంద్రతో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీకోసం…

ప్రశ్న) తెలుగులో మీ లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి మధ్య ఎందుకింత ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు.?

స) ఉపేంద్ర సినిమా తర్వాత నేను పలు కన్నడ సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాను. ఎప్పటి నుంచో ఉపేంద్ర కి సీక్వెల్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాను, కానీ కరెక్ట్ స్క్రిప్ట్ దొరకలేదు. గత కొన్నేళ్లలో ఆలోచించిన చాలా ఐడియాలలో ఫైనల్ గా అందరికీ నచ్చే ఓ స్క్రిప్ట్ దొరికింది. దానినే ‘ఉపేంద్ర 2’లో చూపించాను.

ప్రశ్న) ఉపేంద్ర 2 పబ్లిసిటీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ పబ్లిసిటీ డిజైన్స్ మీరే డిజైన్ చేసారా.?

స) అవును.. నేనే సొంతంగా అన్ని డిజైన్స్ చేసాను. కానీ దాని వెనుక ఓ బలమైన కారణం ఉంది. అది నా సినిమాలో స్టార్ ఇమేజ్ ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ ఎవరూ లేరు, అలాగే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాదు. అందుకే కాస్త క్రియేటివ్ గా థింక్ చేసి సరికొత్త ప్రమోటింగ్ ఐడియాస్ తో నా సినిమాని ప్రమోట్ చేస్తాను.

ప్రశ్న) మీ అన్ని సినిమాలు రెగ్యులర్ సినిమాలకంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకలా.? దానివెనకున్న కారణం ఏంటి.?

స) నేను ఎప్పుడూ ఈ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయేది ఏంటి అనే దానికోసం వెతుకుతూ ఉంటాను. నా మైండ్ లో సమాధానాలు లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి, అందుకే అసలు సొసైటీలో ఏం జరుగుతోంది అనే విషయాలను నా సినిమాలో చూపించడానికి ట్రై చేస్తుంటాను. అందుకే ఏమో నా సినిమాలు చాలా మంచి ప్రేక్షకులకు పెద్దగా నచ్చవు.

ప్రశ్న) మీ ఆలోచనలకి స్పూర్తిగా నిలిచేది ఏది.?

స) నేను జిడ్డు కృష్ణమూర్తిగారిని ఆరాధిస్తాను. నా లైఫ్ లో ప్రతి విషయంలోనూ ఆయన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తుంటాను.

ప్రశ్న) ఈ ఉపేంద్ర 2 నుంచి ఆడియన్స్ ఏమేమి ఆశించవచ్చు.?

స) ఉపేంద్ర 2 లో ఆడియన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. లైఫ్ మరియు నా జర్నీలోని ఇన్నర్ ఫీలింగ్స్ ని అన్ని కలిపి ఈ సినిమాలో చెప్పాను. ఈ సినిమాని మహిళలు కూడా ఎక్కువగా ఇష్టపడతారని ఆశిస్తున్నాను.

ప్రశ్న) ‘S/O సత్యమూర్తి’లో లాంటి స్పెషల్ రోల్స్ చేయడానికి మీరెప్పుడూ సిద్దమేనా.?

స) కచ్చితంగా చేస్తాను, నాకు తెలుగు సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే.. ఎవ్వరూ ఆసక్తికరమైన ఆఫర్స్ ఇవ్వడం లేదు.

ప్రశ్న) నల్లమలపు బుజ్జితో మీకున్న సాన్నిహిత్యం గురించి చెప్పండి.?

స) నాకు చాలా కాలం నుంచి నల్లమలపు బుజ్జి తెలుసు. నేను చేసిన కొన్ని సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్ గా కూడా చేసాడు. నేను ఆయనతో ఎప్పుడూ టచ్ లోనే ఉన్నాను. నేను ఉపేంద్ర 2 సినిమా చేస్తున్నానని తెలియగానే తెలుగులో రిలీజ్ చెయ్యడానికి ఆయన ముందుకొచ్చాడు. ఆయన ఈ సినిమాకి తెలుగు నిర్మాతగా వచ్చాక ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరిగింది.

ప్రశ్న) యాక్టింగ్ మరియు డైరెక్షన్ లో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసేది ఏది.?

స) కచ్చితంగా డైరెక్షన్ అనే చెప్తాను.. ఒక డైరెక్టర్ గా అయితే అన్ని నా కంట్రోల్ లో ఉంటాయి, నాకు నచ్చింది చెయ్యడానికి నిర్ణయించుకునే రైట్ నాకే ఉంటుంది.

Exit mobile version