“రాబిన్ హుడ్” నుండి నితిన్ మరో లుక్ కి డేట్ ఫిక్స్!

టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్. ఈ చిత్రం ను ఇటీవల అనౌన్స్ చేయడం జరిగింది. మేకర్స్ టైటిల్ రివీల్ తో పాటుగా, రిలీజ్ చేసిన వీడియో ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నుండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ వెల్లడించారు.

నితిన్ పుట్టిన రోజు సందర్భం గా మార్చి 30 న న్యూ అవతార్ కి సంబందించిన లుక్ ను విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version