థియేటర్ల పునః ప్రారంభం తో వరుస సినిమాలు విడుదల కి సిద్దం అవుతున్నాయి. అయితే యంత్ర ప్రగడ యుగంధర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇప్పుడు కాక ఇంకెప్పుడు. ఈ చిత్రం లో నమ్రతదరేకర్, పూజా రామ చంద్రన్, హస్వంత్ వంగ, కల్యాణ్ గౌడ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల కి సిద్దం అయినట్లు తెలుస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ విడుదల తేదీ తో ఉన్న పోస్టర్ ను విడుదల చేసింది. ఆగస్ట్ 6 వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. చింత గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు.
