ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ అలాగే స్టార్ హీరోయిన్ త్రిష పేర్లు తమిళ సినీ వర్గాల్లో అలాగే సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో చర్చ జరుగుతుంది. విజయ్ నుంచి తన భార్య సంగీత అతని నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. పైగా విజయ్ కి ఓ హీరోయిన్ కి సంబంధం ఉంది అన్నట్టు కూడా ఆమె ఆరోపించడం మరింత షాకింగ్ గా మారింది.
ఇక ఈ సమయంలోనే విజయ్, త్రిష కలిసి ఓ పెళ్ళికి హాజరు కావడం మరింత చర్చనీయాంశంగా మారగా ఇన్ని రోజులు మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ అనుకున్న త్రిష ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి త్రిషకి ఎంగేజ్మెంట్ అయ్యిందని చాలామందికి ఇప్పుడు వరకు తెలియకపోవచ్చు. కానీ ఆమెకి ఎప్పుడో 2015 లోనే జరిగింది.
అంటే సుమారు 10 సంవత్సరాల కితమే ఆమెకి ఎంగేజ్మెంట్ అయ్యింది కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. దీనితో హీరోయిన్ నయనతార పోస్ట్ కూడా ఒకటి త్రిషపై అప్పుడు పెట్టింది నెటిజన్స్ వెలికి తీసి మరీ వైరల్ చేస్తున్నారు. దీనితో ఈ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. మరి ఈ టాపిక్ అంతా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
Congratulations and Best wishes to #Trisha and #Varun ..And they are engaged👫💑 #Nayanthara @trishtrashers pic.twitter.com/FQhXrGGPRB
— Nayanthara✨ (@NayantharaU) January 23, 2015
