నాగ శౌర్య‌ ‘అశ్వథ్థామ’గా వస్తున్నాడు !

swa

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ప్రొడ‌క్ష‌న్ నెం 3 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసింది చిత్రబృందం. ‘అశ్వథ్థామ’ అని టైటిల్ పెట్టారు. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ.. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని.. ఇక కేవలం ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని.. సినిమాలో సందర్భానుసారం మంచి యాక్షన్ కూడా ఉంటుందని చెప్పారు.

ఇక నిర్మాత ఉషా ముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఈ చిత్రంలో నాగ‌శౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. ‘ఎఫ్ 2’ తరువాత మెహరీన్ చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. మొత్తానికి మెహ‌రిన్ హీరోయిన్ గా మ‌రోసారి ప్రేక్ష‌కుల అలరించబోతుంది. పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీ‌చ‌ర‌ణ్‌, కెమెరా మ‌నోజ్‌ రెడ్డి, ఎడిట‌ర్‌ గారీ బిహెచ్‌, డైరెక్ష‌న్ ర‌మ‌ణ్‌ తేజ‌, ప్రొడ్యూస‌ర్ ఉషా ముల్పూరి,

Exit mobile version