‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ

Irumudi

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో ప్రభంజనం సృష్టిస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పాజిటివ్ రివ్యూస్, సాలిడ్ మౌత్ టాక్‌తో ఈ సినిమా థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోంది.

ఇక ఈ గ్రాండ్ సక్సెస్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా బుకింగ్స్‌లో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. తాజాగా కేవలం ఒకే ఒక్క గంటలో ఏకంగా 36.06 వేల టిక్కెట్లు అమ్ముడుపోయి, రీజినల్ సినిమాల్లో అత్యధిక అవర్లీ సేల్స్ సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం సోషల్ మీడియాలో బుకింగ్ లింక్‌లను అందుబాటులో ఉంచింది.

ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ఎమోషనల్ డ్రామా చిత్రానికి హౌజ్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version