డబుల్ సెంచరీతో దుమ్ములేపిన ‘ఇరుముడి’.. రవితేజ కెరీర్‌లోనే టాప్..!

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.

రవితేజ కెరీర్‌లోనే రూ.200 కోట్ల మైలురాయిని చేరుకున్న తొలి చిత్రంగా ‘ఇరుముడి’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీనికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ పోస్టర్‌ ద్వారా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండా, పండగ సీజన్ లేకపోయినప్పటికీ కేవలం కంటెంట్ బలాన్నే నమ్ముకుని ఈ స్థాయి వసూళ్లు సాధించడం విశేషం.

ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే ఈ సినిమా త్వరలోనే రూ. 250 కోట్ల మార్కును కూడా దాటేస్తుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా అలరించింది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

Exit mobile version