మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేస్తున్న భారీ చిత్రమే డ్రాగన్. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం తారక్ లేకుండానే షూట్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో కొన్ని వారాలు పాటు దూరం అయ్యిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో నీల్ తారక్ లేని పోర్షన్ అంతా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
అయితే ఈ అక్టోబర్ నుంచే మళ్ళీ డ్రాగన్ సెట్స్ లో లూగర్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ రీఎంట్రీ ఇస్తుండగా అందుకు ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఓ సింపుల్ అండ్ స్పెషల్ క్లిప్ ని అనౌన్స్ చేసే సూచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో తారక్ పూర్తిగా ఫిట్ అయ్యి సెట్స్ లోకి అడుగు పెట్టినట్టుగా అందరికీ, ముఖ్యంగా అభిమానులకి ఓ క్లారిటీగా తెలుస్తుంది అని టాక్.
అయితే ఇన్ని రోజులు తారక్ షూట్ కి దూరం అయినప్పటికీ ఆన్ టైం తీసుకొచ్చేందుకే సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
