ఆకాష్ ‘రొమాంటిక్’ పరిస్థితి ఏమిటి ?

ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న కొత్త సినిమా ‘రొమాంటిక్’. ఈ సినిమా ఇప్పటికే పూర్తి అయి రిలీజ్ కి రెడీగా ఉంది. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ లో చిత్రబృందానికి ఇంకా క్లారిటీగా లేదట. మరోపక్క ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. మరి చూడాలి ఈ సినిమా రిలీజ్ పరిస్థితి ఏమిటో ?

యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా రమ్యకృష్ణ ఆకాష్ పూరికి అత్త పాత్రలో నటిస్తోందట. ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. .

ఇక హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version