NBK 111: బాలయ్య ఎంట్రీకి రంగం సిద్ధం?

NBK-111

నందమూరి నటసింహం బాలకృష్ణ రీసెంట్ గా అఖండ 2 తో పలకరించిన సంగతి తెలిసిందే. అంత నెగిటివ్ టాక్ లో కూడా ఈ చిత్రంతో బాలయ్య తెలుగు రాష్ట్రాల్లో 20 రోజులకి పైగా మంచి ఆక్యుపెన్సీ చూపించారు. ఇక ఈ సినిమా తర్వాత అంతా తన 111వ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.

బాలయ్యతో ఈ ప్రాజెక్ట్ ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా అనౌన్సమెంట్ తోనే మంచి హైప్ ఈ సినిమాకి సెట్ అయ్యింది. అయితే ఈ ప్రాజెక్ట్ షూట్ పై అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ పై కూడా పలు రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ మార్చ్ 5 నుంచి మాత్రం సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి రంగం సిద్ధం అయినట్టు తెలుస్తుంది.

కానీ అదే రోజున బాలయ్య తాలూకా ఫస్ట్ లుక్ కూడా ఉంటుంది అని చాలామంది భావిస్తున్నారు కానీ అది ఆరోజున రాకపోవచ్చట. సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ లాంటిదే రావొచ్చని ఇప్పుడు టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version