
మన టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ డిప్యూటీ సీఎం కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న చిత్రాల్లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న పక్కా యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా “ఓజి” కూడా ఒకటి. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి వేరే లెవెల్ హైప్ కనిపిస్తుండగా ఇప్పుడు మళ్ళీ ఓజి పై అభిమానుల్లో సందడి నెలకొంది. ఇక చాలా కాలం నుంచి పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వినిపిస్తుంది.
దీని ప్రకారం ఓజి సెట్స్ లోకి ఓజాస్ గంభీర ఆగమనం ఈ మే 14 నుంచే ఉంటుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే దాదాపు ఈ నెలాఖరు వరకు పవన్ ఓజి కోసమే సమయం వెచ్చించనున్నట్టుగా టాక్. మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.