బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో రాబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, సోమవారం నుంచి ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభిస్తున్నారు. మొదట బాలయ్య తన ఇంట్లోనే డబ్బింగ్ చెప్పనున్నారు. అందుకు సంబంధించిన డబ్బింగ్ సెటప్ కూడా బాలయ్య ఇంట్లో ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటివరకు అయిన షూటింగ్ పార్ట్ కి బాలయ్య డబ్బింగ్ చెబుతారట.
అన్నట్టు మిగిలిన షూట్‌ని శరవేగంగా ముగించేందుకు రెడీ అవుతున్నారు. గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న బాలయ్య త్వరలోనే తిరిగి ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతారట. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బాలయ్యను ఒక రాజుగా చూపించారు.
బాలకృష్ణ – దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.
