కొరటాల సినిమా కోసం ‘బాలయ్య’ రెడీ ?

కొరటాల సినిమా కోసం ‘బాలయ్య’ రెడీ ?

Published on Sep 20, 2026 2:00 PM IST

కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఈ మేరకు బాలయ్య డేట్స్ కూడా లాక్ చేసారని తెలుస్తోంది. ముందుగా తీయనున్న యాక్షన్ సీన్స్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో బాలయ్య పైనే షూట్ చేస్తారట. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాలయ్య సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. ఇక తన గాయం నుంచి బాలయ్య వేగంగా కోలుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఎలాగూ దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాలో రాజకీయ అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించనున్నారు.

తాజా వార్తలు