సాలిడ్ థ్రిల్లర్ ‘పొలిమేర 3’ లోకి బ్లాస్ట్ నటుడు?

మన టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన పలు క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో కమెడియన్ టర్న్డ్ సత్యం రాజేష్ హీరోగా దర్శకుడు అనీల్ విశ్వనాధ్ కాంబినేషన్ లో వచ్చిన థ్రిల్లర్ హిట్ చిత్రం పొలిమేర కూడా ఒకటి. మొదటి సినిమా ఓటిటిలో వచ్చినప్పటికీ సూపర్ హిట్ అయ్యింది. దీనితో పార్ట్ 2 ని థియేటర్స్ లో ప్లాన్ చేశారు.

ఇలా పార్ట్ 2 తర్వాత మూడో భాగాన్ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని మరింత గ్రాండ్ స్కేల్ లో కన్ఫర్మ్ చేశారు. అయితే లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం పొలిమేర 3 లోకి యాక్షన్ కింగ్ అర్జున్ ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల బ్లాస్ట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న అర్జున్ ఇపుడు పొలిమేర 3 లో కీలక పాత్ర పోషించనున్నారట. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version