బాబీ సినిమా కోసం రగ్గుడ్ లుక్ లో మెగాస్టార్?

Chiru-Boby

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు ఈ ఏడాదిలో టాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ‘విశ్వంభర’ అలానే తన కెరీర్ 158వ చిత్రం కూడా చేయనున్నారు. దర్శకుడు బాబీతో చేయనున్న 158వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం మెగాస్టార్ లుక్ టెస్ట్ కూడా కొన్ని రోజులు కితమే మేకర్స్ పూర్తి చేశారు.

అయితే ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ వెర్షన్ లు వినిపిస్తున్నాయి. గతంలో గాడ్ ఫాదర్ కి ట్రై చేసినట్టుగా ఈ సినిమాకి కూడా చిరు సాల్ట్ అండ్ పెప్పర్, కొంచెం రగ్గుడ్ లుక్ లో కనిపించనున్నారా అని తెలుస్తుంది. రీసెంట్ ఫొటోస్ లో కూడా చిరు ఇదే లుక్ లో కనిపించడం అంతే కాకుండా కొంచెం బరువు కూడా రోల్ కోసం పెరిగినట్టు కనిపిస్తుంది. మరి మెగాస్టార్ తో ఈసారి బాబీ ఏం ప్లాన్ చేసాడో చూడాలి మరి.

Exit mobile version