తెలుగులో డిజాస్టర్.. బయట భారీ వసూళ్లు.. ‘దృశ్యం’ మేకర్స్ రాంగ్ స్టెప్ వేసారా!

Drishyam-3

మోలీవుడ్ కంప్లీట్ నటుడు మోహన్ లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ థ్రిల్లర్ చిత్రమే “దృశ్యం”. దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా మూడో భాగం ఇప్పుడు సినిమా వచ్చి భారీ వసూళ్లు రాబడుతుంది. మోలీవుడ్ లో అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో వందల కోట్ల వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా తెలుగులో మాత్రం డిజాస్టర్ అనే చెప్పాలి. మోహన్ లాల్ గత సినిమాల ప్రమోషన్స్ అయినా చేసారు కానీ కనీసం ఈ సినిమా మినిమమ్ ప్రమోషన్స్ కూడా చెయ్యలేదు.

వీటితో చెప్పుకోదగ్గ రేంజ్ వసూళ్లు కూడా ఈ చిత్రానికి రావడం లేదు. పైగా టాక్ కూడా మిక్స్డ్ రావడంతో తెలుగు ఆడియెన్స్ ఈ చిత్రానికి మొహం చాటేశారు. ఈ చిత్రాన్ని నీట్ గా వెంకీ మామకే వదిలేసి ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ ఇలా ఉండేది కాదు. ఈ విషయంలో మాత్రం దృశ్యం మేకర్స్ రాంగ్ స్టెప్ వేశారనే అనుకోవాలి. ఎలాగో తెలుగులో సినిమా ప్లాప్, అనుకున్న రీచ్ కూడా రాలేదు కాబట్టి తెలుగులో వెంకీ మామతో రీమేక్ అవుతుందో లేదో చూడాలి.

Exit mobile version