ఈ ఫ్రైడే తెలుగు ఆడియెన్స్ ని అలరించడానికి థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో ధురంధర్ బ్యూటీ సారా అర్జున్, మన టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన యూత్ డ్రామా “యుఫోరియా” కూడా ఒకటి. అయితే ఈ సినిమాకి మాత్రం మంచి మౌత్ టాక్ రావడం విశేషం. దీనితో గుణశేఖర్ వర్క్ కి కూడా చూసిన ఆడియెన్స్ నుంచి మంచి మార్కులు వస్తున్నాయి.
సో ఇదే తనకి మంచి కంబ్యాక్ కూడా అనుకోవచ్చు కానీ ఇది మరోలా అని చెప్పాలి. అసలు మన తెలుగు సినిమా దగ్గర భారీ సెట్స్ అంటే ఇప్పుడు రాజమౌళి అంటారు కానీ అంతకు మునుపే ఎన్నో ప్రయోగాలు భారీ సెట్టింగ్ లు, వి ఎఫ్ ఎక్స్ చేసిన హిస్టరీ గుణశేఖర్ కి ఉంది. కానీ కంప్లీట్ గా ఆ ట్రాక్ ని పక్కన పెట్టి చేసిన యుఫోరియా సినిమాలో తన వర్క్ కి మంచి మార్కులు వస్తున్నాయి. సో ఈ రకంగా ఇది తనకి డీసెంట్ కంబ్యాక్ అనుకోవచ్చు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా రాణిస్తుందో చూడాలి.
