తన కం బ్యాక్ చిత్రంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్”తో రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల అన్ని పరిస్థితులు మారిపోయాయి. దీనితో పవన్ కం బ్యాక్ చిత్రం మరింత దూరం జరగాల్సి వచ్చింది. అయితే మరి ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడడంతో సినిమాలు మళ్ళీ థియేటర్స్ వరకు వస్తున్నాయి.
మరి అయినప్పటికీ పలు చిత్రాలు వసూళ్ల విషయంలో దెబ్బ పడుతుందనే అనుమానాలు కూడా లేకపోలేవు. కేవలం 50 శాతం ఆడియెన్స్ తో అయితే పలు చిత్రాలు లాభాల బాట అందులోను టికెట్ రేట్ పెంచకుండా అన్నది క్లిష్టమైన ప్రశ్నే అని చెప్పాలి. మరి అందుకే తమిళనాట విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్” కు ఫుల్ ఆక్యుపెన్సీ ను మేకర్స్ తెచ్చుకున్నారు.
మరి ఆ చిత్రానికి ఆ ఫెసిలిటీ కల్పించడంతో మన దగ్గర అందుకు అవకాశం దక్కే సినిమా ఏదన్నా ఇప్పట్లో ఉంది అంటే అది వకీల్ సాబ్ అనే చెప్పాలి. అలాగే దీనికే ఆ బజ్ కూడా వినిపిస్తుంది. ఇదంతా మరి నిర్మాత దిల్ రాజు చేతుల్లోనే ఉంది. తన డ్రీం ప్రాజెక్ట్ కు దిల్ రాజు లైన్ క్లియర్ చేస్తారో లేదో చూడాలి.
