ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో అదిరిపోయే ఫామ్ లో ఉన్నారు. దీనితో అదే ఫామ్ ను కొనసాగించాలని వరుస విజయ చిత్రాల దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే అదిరిపోయే సినిమాను లైన్ లో పెట్టారు. అయితే అసలు ఈ చిత్రం మహేష్ లైన్ లోకి రాక ముందు తన 25వ సినిమాగా “మహర్షి” అనే డీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో చెయ్యాల్సి ఉంది. కానీ అనూహ్యంగా అది కాస్త పక్కకు వెళ్ళింది.
అలాగే ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య మంతనాలు జరిగాయి కానీ అవి కాస్త ఫలించలేదనే టాక్ వచ్చింది. కానీ లేటెస్ట్ గా బయటకొచ్చిన ఫొటోలో మహేష్ తో పాటు ఈ దర్శకుడు కూడా దర్శనమివ్వడం హాట్ టాపిక్ కు దారి తీసింది. మరి వీరు ఫ్రెండ్లీ గానే కలిసారా లేక సినిమా కూడా ఏమన్నా ఫిక్స్ అయ్యిందా అన్నది సస్పెన్స్ గా మారింది. వీరిద్దరి కలయికలో మరో సినిమా రావాలని మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మరి దాదాపు వీరి మధ్య ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.
