ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘డెకాయిట్’?

Dacoit

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ లవ్ స్టోరీ చిత్రమే డెకాయిట్. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం అంచనాలు అందుకొని సాలిడ్ వసూళ్లు కూడా రాబట్టింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో మూడు వారాలు పూర్తి చేసుకున్నప్పటికీ వీకెండ్స్ లో మంచి బుకింగ్స్ కనబరిచింది.

ఇలా ఫైనల్ గా థియేటర్స్ నుంచి ఓటిటి ఎంట్రీకి ఇప్పుడు సిద్ధం అయినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అందులో ఈ సినిమా ఈ మే 8 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ కానున్నట్టుగా తెలుస్తుంది. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సుప్రియ యార్లగడ్డ నిర్మాణం వహించారు.

Exit mobile version