ప్రభాస్ “సలార్” వాయిదా పడనుందా?

పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ఆదిపురుష్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు సరికొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ను వచ్చే ఏడాది జూన్ 16 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. అయితే ఈ చిత్రం కాస్త వాయిదా పడటం తో అందరి చూపు సలార్ వైపే ఉంది.

ఈ చిత్రం ను మేకర్స్ వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆదిపురుష్ వాయిదా పడటం తో ఈ చిత్రం కూడా వాయిదా పడే అవకాశం ఉంది. కేవలం మూడు నెలల వ్యవధి లో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లను మేకర్స్ కోరుకోవడం లేదు. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Exit mobile version