
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శ్రీనువైట్ల ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గతంలో శ్రీనువైట్లతో కలిసి సూపర్ హిట్ సినిమాలకు రచయితలుగా పనిచేసిన కోన వెంకట్, గోపీ మోహన్‌లు ఈ సినిమాకు రచయితలుగా పనిచేస్తున్నారు. డీవీవీ దానయ్య చాలా రిచ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ హైద్రాబాద్‌లో జరుగుతోంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపిస్తాడన్న ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నట్లు తాజాగా మరో ప్రచారం జరుగుతోంది. హైద్రాబాద్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో లీకైన కొన్ని ఫోటోలు ఈ ప్రచారాన్ని మరింత బలపరుస్తున్నాయి. పోలీస్ డ్రెస్‌లో ఉన్న రామ్ చరణ్ వర్కింగ్ స్టిల్స్ కొన్ని కొద్దిసేపటి క్రితం లీకయ్యాయ్! రామ్ చరణ్ ఇదివరకు ‘తుఫాన్’ అనే సినిమాలో పోలీస్‌గా కనిపించిన విషయం తెలిసిందే!