రానా నుంచి మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్.?

Rana Daggubati

మన టాలీవుడ్ హల్క్ రానా ఎంత పరిణితి చెందిన నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు మరియు హిందీ సినిమాల్లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ నటుడు బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా అంతటినీ పలకరించాడు. ఇక అక్కడ నుంచి పాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్న రానా లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “అయ్యప్పణం కోషియం” రీమేక్ ను ఒప్పుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

రానా ఇటీవలే మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను ఓకే చేసినట్టుగా టాక్ వస్తుంది. అయితే మరి ఇది సినిమానా లేక ఏదన్నా ఓటిటి ప్లాట్ ఫామ్ కు ఒప్పుకున్నా భారీ ప్రాజెక్టా అన్నది ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఇక అలాగే రానా నటించిన లేటెస్ట్ చిత్రం “అరణ్య” వచ్చే సంక్రాంతి రేస్ లో విడుదల కానుండగా మరో చిత్రం “విరాట పర్వం” షూటింగ్ అంతిమ దశలోకి చేరుకుంది. మరి రానా నిజంగానే మరో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను టేకప్ చేసాడో లేదో కాలమే నిర్ణయించాలి.

Exit mobile version