రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, సినిమాలో రవితేజ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. పైగా క్లైమాక్స్ సీన్స్ లో రవితేజ లుక్ కూడా అభిమానులను కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తోందని.. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని శివ నిర్వాణ రవితేజ పాత్రను ఇలా ప్రత్యేకంగా ప్లాన్ చేశాడాట.
ఇక ‘కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా’’ అని రవితేజ ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది.


