మౌళీ ‘దొంగనా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్? లిటిల్ హార్ట్స్ సెంటిమెంటా?

మౌళీ ‘దొంగనా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్? లిటిల్ హార్ట్స్ సెంటిమెంటా?

Published on Aug 12, 2026 12:12 PM IST

గత ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర చిన్న సినిమాలే ఎక్కువగా పెద్ద విజయాలు సాధించాయి. అలా వచ్చి హిట్ అయ్యిన సినిమాల్లో హీరోగా పరిచయం అయ్యిన ప్రముఖ యూట్యూబ్ స్టార్ మౌళీ తనూజ్ హీరోగా చేసిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’ కూడా ఒకటి. ఇలా డెబ్యూ తోనే సాలిడ్ హిట్ కొట్టిన మౌళి హీరోగా నటించిన రెండో కామెడీ ఎంటర్టైనర్ చిత్రమే ‘దొంగ నా కొడుకు’.

జస్ట్ రీసెంట్ గానే టైటిల్ అనౌన్స్ చేసుకున్న ఈ చిత్రం అప్పుడే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ సెప్టెంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదే సమయంలో ఎందుకంటే గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సెప్టెంబర్ 5న వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

సో అలా సెంటిమెంటల్ గా కలిసొస్తుందనే భావనతో దొంగనా కొడుకు ని కూడా దింపనున్నట్టు టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి శ్రీను కంబళ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు