
సూపర్ డూపర్ క్లాసికాల్ హిట్ ‘మనం’ తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి దర్శకుడు విక్రమ్ కుమార్ రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ’24’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు. గతంలో మాధవన్ హీరోగా ఈ దర్శకుడు రూపొందించిన తమిళ సినిమాకు ’13బి’ అనే టైటిల్ పెట్టడం విశేషం. బహుశా విక్రమ్ కు తమిళంలో నెంబర్ సెంటిమెంట్ ఉందేమో..?
2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఅర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘మనం’ సినిమాకు వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ మరోసారి విక్రమ్ కుమార్ తో కలసి వర్క్ చేయనున్నారు.