నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, బాలకృష్ణ.. తన ‘ఆదిత్య 369’కి కొనసాగింపుగా రూపొందనున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’తోనే మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం కానున్నట్టు క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయిందట. ఐతే, తాజాగా ఈ సినిమాలో నటించే ప్రతినాయకుడి పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో ఉపేంద్ర పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందట. అలాగే, ఉపేంద్ర లుక్ కూడా మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. ఐతే, ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఆ మధ్య తన వారసుడి ఎంట్రీ పై బాలయ్య మాట్లాడుతూ.. ‘మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు. మోక్షజ్ఞ కోసం ఒక ఐదు ఆరు స్క్రిప్ట్స్ నా మైండ్ లోనే రెడీగా ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు.
