మహేశ్ బాబుతో హిట్ డైరెక్టర్ ఫిక్స్ అయినట్లేనా ?

Mahesh ANil

అనిల్ రావిపూడి తన తరువాత సినిమాను మహేశ్ బాబుతో చేస్తున్నాడనే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేశ్ సరసన సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఇక కామెడీని హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేస్తోన్న డైరెక్టర్. డైలాగ్ రైటర్ గా కెరీర్ మొదలు పెట్టి .. సక్సెస్ ఫుల్ సినిమాల డైరెక్టర్ గా ఎదిగాడు. ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్ ను కొట్టాడు అనిల్.

ఇప్పుడు ఏకంగా మహేశ్ బాబును డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. మహేశ్ సినిమా కోసం అనిల్ ఇప్పటికే స్క్రిప్ట్ ను కూడా రాస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే మహేష్ కు లైన్ ను కూడా వినిపించాడట. ఆ లైన్ మహేష్ కు బాగా నచ్చినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

Exit mobile version