రాజ్ తరుణ్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నుండి ప్రమోషన్స్ వేగవంతం అయ్యాయి. కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 25 విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
మరి ఇద్దరి లోకం’ విజయం తీసుకువస్తోందా ? ఈ సినిమా హిట్ అయితేనే రాజ్ తరుణ్ కెరీర్ నిలబడుతుంది. ఎందుకంటే గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన షాలినీ పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయినట్లు హీరోయిన్ పరిస్థితి అలాగే ఉంది. ఈ సినిమాతోనైనా రాజా తరుణ్ కి షాలినీ పాండేకు మంచి హిట్ వస్తోందేమో చూడాలి.
