
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు భారీ చిత్రాల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓంరౌత్ ఈ చిత్రాన్ని అధికారికంగా ఈరోజు నుంచే మొదలు పెట్టినట్టుగా క్లారిటీ ఇచ్చేసాడు. దీనితో మరోసారి ఈ భారీ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతుంది.
మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలు పెట్టాయి. మరి వీటిలో ప్రభాస్ తో పాటుగా బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవ్ గన్ కూడా కనిపిస్తుండడం ఆసక్తిగా అనిపిస్తుంది. ఇంతకు ముందే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు గాను అజయ్ పేరు అనుకున్నారని ఆ మధ్య గాసిప్స్ వైరల్ అయ్యాయి.
కానీ వాటిలో ఎలాంటి నిజమూ లేదని అజయ్ దేవ్ గన్ యూనిట్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఇపుడు ఈ ముహూర్తం కార్యక్రమం ఫొటోల్లో అజయ్ కూడా కనిపించడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. మరి నిజం గానే ఈ స్టార్ హీరో ఈ చిత్రంలో ఉన్నాడా లేదా అన్నది చూడాలి.