సెన్స్ బుల్ డైరెక్టర్ క్రిష్ – పవన్ కళ్యాణ్ కలయికలో రానున్న సినిమా టైటిల్ పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాకి ‘ఓం శివమ్’ అని టైటిల్ పెట్టబోతునట్లు తెలుస్తోంది. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్ డేట్ వెలువడలేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పాత్ర సెకెండ్ హాఫ్ లో చనిపోతుందని, ఆమె చనిపోయే ఎమోషనల్ సీన్ సినిమాలోనే కీలకం అని తెలుస్తోంది.
అలాగే పవన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక పవన్ నుండి వరుసగా రెండు సినిమాలు రానుండటంతో తమ హీరో ఇక సినిమాలే చేయరని నిరుత్సాహపడిన పవర్ స్టార్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే కరోనా కారణంగా ‘పవన్ – క్రిష్’ సినిమాని ఈ ఏడాది మొత్తం పోస్ట్ ఫోన్ చేయనున్నారు. భారీ సెట్లలో భారీ స్థాయిలో ఈ సినిమాని క్రిష్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ భారి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
