విడుదల తేదీ : ఫిబ్రవరి 20, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : తాప్సీ, కని కుస్రుతి, రేవతి, కుముద్ మిశ్రా, మనోజ్ పహ్వా తదితరులు
దర్శకుడు : అనుభవ్ సిన్హా
నిర్మాతలు : భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అనుభవ్ సిన్హా
సంగీత దర్శకుడు : రంజిత్ బరోత్
సినిమాటోగ్రాఫర్ : ఇవాన్ ముల్లిగన్
ఎడిటర్ : మర్జిత్ సింగ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా ‘అస్సీ’ (Assi) ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసింది. తాప్సీ, కని కుస్రుతి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం నేడు వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
Assi కథ :
పరిమ(కని కుస్రుతి) ఒక టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఓ రోజు ఆమెను కొందరు దుండగులు రేప్ చేస్తారు. దీంతో ఆమెకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో వాదిస్తుంది అడ్వకేట్ రావి(తాప్సీ). ఈ క్రమంలో రావి ఎలాంటి విషయాలను బట్టబయలు చేసింది.. పరిమను బలాత్కారం చేసిన దుండగులు ఎవరు..? పోలీసులు వారిని పట్టుకున్నారా..? పరిమకు న్యాయం జరిగిందా..? అనేది ఈ చిత్ర కథ.
ప్లస్ పాయింట్స్ :
కోర్టు రూమ్ డ్రామాల్లో ఉండే ఇంటెన్సిటీ ఈ సినిమాలో బోలెడంత కనిపిస్తుంది. ఓ మహిళకు అన్యాయం జరిగితే, ఆమెకు న్యాయం కలిగేలా జరిగే కోర్ట్ రూమ్ డ్రామా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ముఖ్యంగా నేటి సమాజంపై దర్శకుడు చేసిన పాయింట్ మరింతగా ఆకట్టుకుంటుంది. నేటి సమాజంలో మహిళలపై రేప్‌లు జరగడం కామన్ అయిపోయిందనే భావనపై దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఇక బాధితురాలి పాత్రలో కని కుస్రుతి చక్కగా నటించింది. ఆమె తన ఎక్స్‌ప్రెషన్స్‌తో పలికించిన పెయిన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. అడ్వకేట్ పాత్రలో తాప్సీ ఒదిగిపోయింది. మరో కీలక పాత్రలో కుముద్ మిశ్రా కూడా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కథలోని కోర్ పాయింట్‌ను ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కథ చాలా స్లోగా సాగుతుంది. కథలోకి తీసుకెళ్లేందుకు దర్శకుడు చాలా సమయం తీసుకుంటాడు. ఇక రేప్ ఘటన జరిగిన తర్వాత చోటు చేసుకునే పరిణామాలు చాలా డ్రమాటిక్‌గా అనిపించాయి. పోలీసులు ఇదొక సాధారణ క్రైమ్‌గా భావించే తీరు ప్రేక్షకులను మెప్పించదు. అటు కని కుస్రుత్ పాత్రను కూడా పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయలేదనిపిస్తుంది.
తాప్సీ పాత్రలో కావాల్సినంత ఇంటెన్సిటీ కనిపించలేదు. ఆమె పాత్రను కేవలం సెకండాఫ్‌కే ప్రాధాన్యత ఇవ్వడం మెప్పించదు. కని కుస్రుత్ భర్త పాత్ర కూడా చాలా వీక్‌గా రాసుకున్నారు. కుముద్ మిశ్రా పాత్ర బాగున్నా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్, ముగింపు లేదనిపిస్తుంది.
సెకండాఫ్‌లో కోర్ట్ రూమ్ సీన్స్‌ను చాలా సాగదీతగా చూపెట్టారు. స్క్రీన్ ప్లేలో చాలా సీన్స్ నెమ్మదించినట్లుగా సాగడం మైనస్. నసీరుద్దీన్ షా వంటి సీనియర్ యాక్టర్‌కు సరైన క్యామియో పడలేదని చెప్పాలి.
సాంకేతిక విభాగం :
దర్శకుడు అనుభవ్ సిన్హా రాసుకున్న కథలోని మెయిన్ పాయింట్ బాగున్నా, దానిని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడంలో తడబడ్డారు. చక్కటి మెసేజ్ ఉన్న ఈ సినిమాను స్లో పేస్, వీక్ స్క్రీన్ ప్లే దెబ్బతీశాయి. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ పరంగా ఫర్వాలేదనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే మ్యూజిక్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. ఎడిటింగ్ విషయంలో ఇంకా బెటర్‌గా వర్క్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘అస్సీ’ (Assi) సినిమాలోని కోర్ పాయింట్ ఓ చక్కటి సందేశాన్ని అందించే విధంగా ఉన్నా, సినిమాను ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఫెయిల్ అయింది. తాప్సీ, కని కుస్రుతి తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నారు. ఇలాంటి సీరియస్ కథకు స్లో పేస్, బోరింగ్ స్క్రీన్ ప్లే డ్యామేజ్ చేశాయి. కోర్ట్ రూమ్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా పూర్తిస్థాయిలో కనెక్ట్ కాకపోవచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
