‘విశ్వంభర’ క్లారిటీ కూడా అప్పుడేనా?

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన భారీ ఫాంటసీ డ్రామా సినిమానే “విశ్వంభర”. మెగాస్టార్ ని ఎంతో కాలంగా ఈ తరహా సినిమాలో చూడాలని ఆడియెన్స్ ఎగ్జైటెడ్ గా ఈ సినిమా కోసం ఉన్నారు. అయితే పలు కారణాలు చేత వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాపై హైప్ అలా నీరుగారింది.

కానీ ఇప్పుడు మళ్ళీ విశ్వంభర రిలీజ్ కి సంబంధించి ఇదే ఆఖరి మాట అన్నట్టుగా వచ్చిన బజ్ మళ్ళీ హైప్ ని బిల్డ్ చేస్తుంది. అయితే విశ్వంభర విడుదల ఆల్రెడీ అక్టోబర్ 16 అని సినీ వర్గాల్లో కన్ఫర్మేషన్ అనధికారికంగా వచ్చేసింది. కానీ దీనిని అధికారికంగా ఎప్పుడు అనౌన్స్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈసారి కూడా సాలిడ్ కంటెంట్ తో జూలై లోనే సమాధానం ఇస్తారా లేక మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఆగస్ట్ 22నే ప్రకటిస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఆల్రెడీ మెగా 158 అప్డేట్ ఆ డేట్ లో ఖరారు అయ్యింది. సో ఇది ముందే వచ్చినా ఆశ్చర్యం లేదు.

Exit mobile version