మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేస్తున్న భారీ చిత్రమే “డ్రాగన్”. అధికారికంగా ఈ టైటిల్ ని ఈ మే 20న మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. అయితే ఈ చిత్రం నుంచి బిగ్గెస్ట్ ట్రీట్ గా తారక్ పుట్టినరోజుకి మేకర్స్ సాలిడ్ ఫస్ట్ పోస్టర్ ఇంకా గ్లింప్స్ ని ఖాయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
సరిగ్గా మే 20 అర్ధ రాత్రి తారక్ పుట్టినరోజు రోజు మొదలవ్వడంతోనే కొన్ని నిమిషాల్లో గ్లింప్స్ వదులుతారు అని ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో టాక్ స్ప్రెడ్ అయ్యింది. కానీ సరిగ్గా సమయం ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ బజ్ తారక్ లక్కీ నెంబర్ 9 సంఖ్య వచ్చేలా ఈ గ్లింప్స్ ని వదలనున్నారని టాక్.
అంటే 12 గంటల 6 నిమిషాలకి ఈ సాలిడ్ గ్లింప్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా మేకర్స్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాని తెరకెక్కిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది జూన్ 11న గ్రాండ్ గా సినిమా విడుదల కానుంది.


