మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న అవైటెడ్ భారీ సినిమానే రణబాలి. ముచ్చటగా మూడోసారి చేస్తున్న ఈ సినిమాని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నాడు. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దీనిని ప్లాన్ చేస్తుండగా మేకర్స్ ఈ సినిమాని ఆల్రెడీ ఈ సెప్టెంబర్ 11 విడుదలకి లాక్ చేసిన సంగతి తెలిసిందే.
కానీ ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ ప్రకారం రణబాలి ఈ డేట్ నుంచి వెనక్కి వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇక కొత్త డేట్ గా అక్టోబర్ లో డేట్ ఫిక్స్ కానున్నట్లు తెలుస్తోంది. సో రణబాలి విషయంలో ఓ తుది క్లారిటీ ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఆదిపురుష్ సంగీత దర్శకులు అజయ్, అతుల్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మాణం వహిస్తున్నారు.
