కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ అలాగే తారా సుతారియా ఫీమేల్ లీడ్ లలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రమే “టాక్సిక్”. యష్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అలా ఆలస్యం అవుతూ ఆగస్టులో రిలీజ్ కి రాబోతుంది.
అయితే ఈ చిత్రం తాలూకా ట్రైలర్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం మేకర్స్ ఈ ఆగస్ట్ 8న విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ వచ్చిన గ్లింప్స్, టీజర్ లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చిలు పాటలు అందిస్తున్నారు. అలాగే యష్, కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహించారు.
