బాలీవుడ్ లోకి పూరి సినిమా ?

puri

ఈ మధ్య బాలీవుడ్ నిర్మాతల చూపు తెలుగు సినిమాల కథల పై పడింది. ఇక్కడ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి అక్కడి నిర్మాణ సంస్థలు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో వాటిలో ‘జెర్సీ, ఆర్ఎక్స్100’ సినిమాల రైట్స్ ను కొనేశారు. అలాగే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం యొక్క హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మరొక తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం కూడా రీమేక్ అవుతుందట.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద గుడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఓవర్శిస్ తో పాటు తెలుగు రాష్ట్రాల అన్ని కేంద్రాల్లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఈ చిత్రం రెట్టింపు లాభాలనుసొంతం చేసుకుంది. మొత్తానికి, ఇస్మార్ట్ శంకర్ పూరికి మరియు హీరో రామ్ కి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది, మరి రణబీర్ కపూర్ కి కూడా సూపర్ హిట్ ని ఇస్తుందా..? అలాగే రామ్ పాత్రలో రణబీర్ కపూర్ ఎలా నటిస్తాడో చూడాలి. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Exit mobile version