రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఐతే, రవితేజ ఈ సినిమాలో తన కెరీర్ లోనే భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తానికి రెగ్యులర్ మాస్ హీరోగా కాకుండా, భావోద్వేగాలతో కూడిన పాత్రలో కనిపించనున్నాడు. పైగా ఫాదర్–డాటర్ ఎమోషన్ తో సాగే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయట. దీనికితోడు, అయ్యప్ప దీక్ష నేపథ్యం, కథలో అయ్యప్ప మాల, ఇరుముడి సంప్రదాయం, ఆధ్యాత్మికతకు సంబధించిన డైలాగ్స్ సినిమాలో మెయిన్ హైలైట్ గా ఉంటాయట.
ఎలాగూ డైరెక్టర్ శివ నిర్వాణ కుటుంబ భావోద్వేగాలను బాగా హ్యాండిల్ చేయగలడు. ఏ రకంగా చూసుకున్న ఈ సినిమా ఎమోషనల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ మేళవింపుగా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కాబోతుంది. అన్నట్టు, తమిళంలో ఈ చిత్రం ‘ఇరుముడికట్టు’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది.
