
ఇదివరకు కమెడియన్స్ హీరోగా నటించిన సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఏవి బాక్స్ ఆఫీసు దగ్గర నిలబడలేకపోయాయి. అయితే తాజాగా స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ‘నాకొంచం తిక్కుంది’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. హీరోగా నటించడంపై బ్రహ్మానందం తన స్పందన తెలియచేస్తూ, ‘సినిమా మొత్తం తన చుట్టే తిరిగే హీరో పాత్ర చేయడం చాలా తృప్తిని ఇచ్చింది. కానీ ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు నాకు దర్శకుడి పూర్తి నిబద్ధతతో పని చేయాలి. లేకపోతే నా కామెడీ రోల్స్ తో నేను చాలా ఆనందంగా ఉన్నాను’ అని తెలిపారు.
ఇటివలే విడుదల అయిన అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసు గుర్రం’ సినిమాలో బ్రహ్మానందం కామెడీకి చాలా మంచి పేరు వచ్చింది.