
రావు రమేష్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ సినిమాలో కీలక పాత్ర చేయాలన్నా వినిపిస్తున్న పేరు ఇదే.. రావు రమేష్ ఫేమస్ యాక్టర్ రావు గోపాల్ రావు తనయుడు. ఇప్పుడు అందరూ రావు రమేష్ ని అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే తను నటుడిగా రావు గోపాల్ రావు రేంజ్ కి రీచ్ అవుతారా? అని అడుగుతున్నారు
ఈ ప్రశ్నకి రావు రమేష్ సమాధానం ఇస్తూ ‘మా నాన్నగారి రేంజ్ కి రీచ్ అవ్వడం కష్టం. నేను ఒక నటుడిగా మా నాన్నగారు సాధించిన సక్సెస్ లో 10% సాధిస్తే చాలా హ్యాపీగా ఫీలవుతానని’ అన్నాడు. రావు గోపాల్ రావుకి డైలాగ్ డెలివరీలో ప్రత్యేక శైలి ఉంది. మామూలుగా రావు గోపాల్ రావు తన పిల్లలు సినిమాల్లోకి రావడానికి ఇష్టపడలేదు. కానీ రావు రమేష్ అమ్మగారే తనని ఎంకరేజ్ చేసి సినిమాల్లోకి పంపారు.