
‘ప్రియమైన నీకు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘వెంకీ’, ‘సంక్రాంతి’, ‘శ్రీరామదాసు’, ‘రాజన్న’ లాంటి సూపర్ హిట్ సినేమలంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ స్నేహ. చూడటానికి మన ఉంటూ , చీరల్లో కనిపిస్తూ తెలుగు దనాన్ని సినిమాల్లో ప్రతిబింబించేలా చేసింది స్నేహ. ఒక్క అతెలుగులొఎ కాకుండా సౌత్ లోని అన్ని భాషల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించిన స్నేహ 2012లో తమిళ యాక్టర్ అయిన ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మూడు నెలల క్రితం తను త్వరలో తల్లి కాబోతోందని మేము ఇది వరకే తెలియజేశాం.
తాజా సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం స్నేహ పండంటి మగబిడ్డకి కి జన్మనిచ్చింది. దీంతో స్నేహ, ప్రసన్నలతో పాటు వారి కుటుంబ సభ్యులు మొత్తం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రసన్న ఎంతో ఆనందంతో మీడియాకి తెలియజేశాడు. ప్రస్తుతం స్నేహ వారి ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. స్నేహ రీసెంట్ గా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘S/O సత్యమూర్తి’ సినిమాలో కనిపించి అలరించింది.

