బ్రెజిల్ బ్యూటీ ఇజబెల్లి లేటి వెటరన్ డైరెక్టర్ జయంతి సి పరాన్జీ తెరకెక్కిస్తున్న బాక్సింగ్ డ్రామా ‘నరేంద్ర’ నుండి తప్పుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వొకేషన్ నుండి ఇండియా వచ్చిన ఈ హీరోయిన్ జయంత్ ను కలిసి మళ్ళీ ఒకసారి స్క్రిప్ట్ వింది. ఈసినిమాలో తన రోల్ స్ట్రాంగ్ గా వుండడంతో సినిమాలో నటిస్తున్నాని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇక ఈ చిత్రంలో డబ్ల్యు డబ్ల్యు ఈ స్టార్ ది గ్రేట్ ఖలీ కూడా ఒక ముఖ్య ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈచిత్రం తో ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.
నీలేష్ ఏటి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ సంపంత్ సంగీతం అందిస్తుండగా ఇషాన్ ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాని నిర్మిస్తుంది.
Re-setting the record straight!!!! @izabelleleite25 is part of my film #Narendra ???? #telugucinema #telugufilmindustry #tfi #excited #movies #moviemagic pic.twitter.com/QCEKu8uu9A
— Jayanth Paranji (@jayanthparanji) February 23, 2019
