‘మైఖేల్’ బయోపిక్.. అతడికే అన్ని ప్రశంసలూ..!

‘మైఖేల్’ బయోపిక్.. అతడికే అన్ని ప్రశంసలూ..!

Published on Apr 25, 2026 11:09 AM IST

ప్రస్తుతం వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఎంతగానో మాట్లాడుకుంటున్న సాలిడ్ బయోపిక్ చిత్రమే “మైఖేల్”. కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా అంటే అంతా ఎంతో ఎగ్జైట్ అయ్యారు. తన మరణం తర్వాత ఒక మహా శకం ముగియడంతో తన కోట్లాదిమంది అభిమానులు కూడా మామూలు స్థితికి వచ్చారు.

అయితే మైఖేల్ బయోపిక్ అనౌన్స్ అయ్యింది అనగానే అందరిలో ఒక ఉత్కంఠ ఏర్పడింది. అలాంటి దిగ్గజ పర్శనాలిటీ బయోపిక్ అంటే మాటలు కాదు. అంతటి బరువైన పాత్రని ఎవరు చేస్తారు అనే దానికి తన మేనల్లుడు జాఫర్ జాక్సన్ సమాధానంగా వచ్చాడు. అయితే సినిమా విడుదల అయ్యిన తర్వాత మాత్రం ప్రశంసలు అన్నీ తనపైనే ఎక్కువ వస్తున్నాయి.

సినిమా ఎలా ఉంది అనేది పక్కన పెడితే అప్పటి మైఖేల్ జాక్సన్ ని మళ్ళీ చూసినట్టు పాప్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మైఖేల్ మాట, డాన్స్, సాంగ్స్ ఇలా అన్నిటిలోని జాఫర్ తనని ప్రతిబింబించేలా చేయడంతో సినిమా చూసినవారు మాత్రం జాఫర్ కోసం మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. ఇది మాత్రం తన లైఫ్ లోనే బిగ్గెస్ట్ అఛీవ్మెంట్ అనుకోవచ్చు. ఇక పార్ట్ 2 లో తన పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు