స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బొమ్మరిల్లి భాస్కర్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమాలో కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో సిద్ధు మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం ఖాయమని వారు అంటున్నారు.
ఈ మూవీలో అందాల భామ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు అచు రాజమణి, సామ్ సి.ఎస్, సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ చరిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ మూవీ వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.
