‘జాదూగాడు’.. నాగశౌర్యనే..!

jadugadu
గత వారం, ‘ఈ హీరో ఎవరో గుర్తించండి?’ అంటూ ‘జాదూగాడు’ సినిమా సెమీ ఫస్ట్‌లుక్ విడుదల అయింది. కేవలం కాళ్ళ భాగం వరకు మాత్రమే కనిపించేలా డిజైన్ చేసిన ఆ ప్రీ ఫస్ట్‌లుక్‌లో హీరో ఎవరన్న విషయంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. ఆ క్రమంలోనే రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫస్ట్‌లుక్ విడుదలకి ముందే ఒక సినిమాకి మంచి హైప్‌ని తీసుకురావడంలో సినిమా యూనిట్ విజయం సాధించింది. ఎట్టకేలకు ఆ హీరో ఎవరన్నది కొత్త ఫస్ట్‌లుక్ ద్వారా తెలియజేశారు.

‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’, చిత్రాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్న యువహీరో నాగశౌర్య ‘జాదూగాడు’గా మన ముందుకు రానున్నాడు. ఈ సాయంత్రమే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ప్రస్తుతమున్న పోటీలో కేవలం కొత్త కథాంశం, కొత్తగా తీస్తే మాత్రమే సరిపోదని భావించారో ఏమో కానీ ఫస్ట్‌లుక్ విషయంలోనే ఒక కొత్త ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా పట్ల ఆసక్తిని పెంచేశారు. జాదూగాడు సినిమాకు చింతకాయల రవి ఫేం యోగేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version