జగదేక వీరుడు రీరిలీజ్ హిట్.. ‘విశ్వంభర’తో చిరు మళ్ళీ మ్యాజిక్ చేస్తారా?

vishwambhara

మెగాస్టార్ చిరంజీవికి అలాగే ఫాంటసీ జానర్ సినిమాలకి ఒక ప్రత్యేక బంధం ఉందని చెప్పొచ్చు. మరి ఈ జానర్ లో చిరంజీవి నుంచి వచ్చిన సినిమాలకి మన తెలుగు ఆడియెన్స్ లో క్రేజీ రీచ్ కూడా ఉంది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో తెలుగు సినిమాకి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన చిరంజీవి అంజి సినిమాతో ఇలాంటి సినిమాలకి మెగాస్టార్ అంటే డెడ్లీ కాంబినేషన్ అన్నట్టుగా మారింది.

ఇక లేటెస్ట్ గా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీరిలీజ్ చేస్తే దీనికి కూడా మళ్ళీ సాలిడ్ రెస్పాన్స్ థియేటర్స్ లో నమోదు కావడం విశేషం. ఇలా ఈ రీరిలీజ్ కూడా మంచి హిట్ కాగా మళ్ళీ మెగాస్టార్ నుంచి రాబోతున్న అవైటెడ్ ఫాంటసీ జానర్ సినిమా “విశ్వంభర” పై మళ్ళీ హైప్ నెలకొంది.

ఆ మధ్య సినిమా టీజర్ గ్లింప్స్ పై కొన్ని కామెంట్స్ వచ్చాయి. కానీ మెగాస్టార్ కి ఫాంటసీ జానర్ లో సరైన సినిమా పడితే అవేవి పని చెయ్యవు. సో విశ్వంభర సినిమా కాని కరెక్ట్ గా వర్కౌట్ అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కి టాలీవుడ్ ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ ఖాయం అని చెప్పొచ్చు. మరి దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి మరి.

Exit mobile version